వన్డే క్రికెట్ మ్యాచ్‌లో రెండు సెంచరీలతో చరిత్ర సృష్టించిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు లోక్‌సభ గురువారం అభినందనలు తెలిపింది. సచిన్ సాధించిన రికార్డు దేశానికెంతో గర్వకారణమని లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. వన్డే క్రికెట్‌లో ఉన్నత శిఖ రాన్ని అధిరోహించిన సచిన్‌కు తనతోపాటు సభ్యులందరూ అభినందనలు తెల్పుతున్నారని స్పీకర్ పేర్కొన్నారు.
తోటి ఆటగాళ్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్ఫూర్తిగా నిలిచారని స్పీకర్ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని రికార్డులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.