'సూపర్ కౌబారు'గా లారెన్స్
18వ శతాబ్దానికి చెందిన ఓ కథను తీసుకుని కామెడీ ఎండ్వచంర్‌గా 'సూపర్ కౌబారు' రూపొందుతోంది. లారెన్స్ కథానాయకుడిగా రూపొందుతోంది. ఎ.జి.ఎస్. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై.లిమిటెడ్ పతాకంపై కల్పాతి ఎస్.అగోరమ్ సమర్పిస్తున్నారు. శింబుదేవన్ దర్శకత్వం వహిస్తున్నారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో భారీగా నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకా చిత్రం గురించి లారెన్స్ మాట్లాడుతూ...జి.వి.ప్రకాష్ మ్యూజిక్ బాగుంది. ఇంతవరకు తీయని లొకేషన్స్‌లో తీసిన 'సూపర్ కౌబారు' హీరోగా నాకు సూపర్ డూపర్ హిట్ నిస్తుంది'అని అన్నారు. దర్శకుడు శింబుదేవన్ మాట్లాడుతూ...'18వ శతాబ్దానికి చెందిన కథను తీసుకుని కామెడీ ఎడ్వంచర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మాస్ ఆడియన్స్‌తోపాటు మహిళలు, చిన్న పిల్లలు కూడా ఇష్టపడేవిధంగా ఈ చిత్రం తీస్తున్నాం. రెడ్ ఇండియన్స్ గురించి ఇంతకుముందు ఎవరూ చూపించని విధంగా ఇందులో చూపిస్తున్నాం. అందుకోసం హాలీవుడ్ స్టైల్‌లో కేరళలో 300 మంది వర్కర్స్‌తో రాత్రింబవళ్ళు వర్క్ చేయించి అద్భుతమైన సెట్ వేశాం. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ఇదో భారీ సెట్‌గా చెప్పుకోవచ్చు. శిధిలావస్థలో ఉన్న విజయనగర సామ్రాజ్యపు కందికోటలోని కంది కెనాల్‌లో ఫస్ట్‌టైమ్ షూట్ చేసిన చిత్రమిది. కంది కెనాల్‌లో రోజూ 20 కిలోమీటర్లు బోట్ ద్వారా ప్రయాణించి వెళ్ళి షూటింగ్ చేశాం. 30 అడుగుల లోతులో ఉన్న ఈ నదిలో చాలా రిస్కీ షాట్స్‌చిత్రీకరించాం. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ హార్స్ రైడింగ్‌లో శిక్షణ ఇవ్వడం జరిగింది. కౌబారు చిత్రాల్లోనే ఎ సెన్సేషనల్‌మూవీగా 'సూపర్ కౌబారు' నిలుస్తుంది' అన్నారు.
సచిన్‌కు లోక్‌సభ అభినందనలు
వన్డే క్రికెట్ మ్యాచ్‌లో రెండు సెంచరీలతో చరిత్ర సృష్టించిన లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్‌కు లోక్‌సభ గురువారం అభినందనలు తెలిపింది. సచిన్ సాధించిన రికార్డు దేశానికెంతో గర్వకారణమని లోక్ సభ స్పీకర్ మీరాకుమార్ అన్నారు. వన్డే క్రికెట్‌లో ఉన్నత శిఖ రాన్ని అధిరోహించిన సచిన్‌కు తనతోపాటు సభ్యులందరూ అభినందనలు తెల్పుతున్నారని స్పీకర్ పేర్కొన్నారు.
తోటి ఆటగాళ్లకు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ స్ఫూర్తిగా నిలిచారని స్పీకర్ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని రికార్డులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.
మరో సారి కాల్పుల విరమణ ఉల్లంఘన
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సాంబా సెక్టార్లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులలో ఒక సైనిక పోస్టుపై బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ జరిపిన కాల్పులలో ఒక బిఎస్‌ఎఫ్ జవాన్ గాయపడ్డాడు. జమ్మూకు 55 కిలోమీటర్ల దూరంలోని ఈ సరిహద్దు పోస్టుపై చిన్న ఆయుధాలతో పాక్‌వైపునుంచి జరిపిన కాల్పులలో బిఎస్‌ఎఫ్ జవాను కిషన్ గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఫ్లాగ్ మీటింగ్ సంద ర్భంగా పాక్ సైనిక అధికారలకు ఈ సంఘటనపై తీవ్ర నిరసన తెలుపు తాము అని అధికారులు చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ పాకిస్తాన్ 10 విడతలు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు.
మమతకు సిఎం రోశయ్య కృతజ్ఞతలు
కేంద్ర మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్ పట్ల ముఖ్యమంత్రి రోశయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తగినన్ని ప్రాజెక్టులు కేటాయించినందుకు మమతకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన లేఖ రాశారు. గతంలో తాను జరిపినఢిల్లి పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్, ఆర్థికమంత్రి ప్రణబ్ ముఖర్జీలతో రైల్యే బడ్జెట్‌పై చేసిన సంప్రదింపులు ఫలించాయని సిఎం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ముందుకొస్తే రాష్ట్ర వాటా విడుదల చేసేందుకు సిద్థమేనని రోశయ్య ఆ లేఖలో స్పష్టం చేశారు.
Subscribe to:
Posts (Atom)