మరో సారి కాల్పుల విరమణ ఉల్లంఘన
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సాంబా సెక్టార్లోని భారత్-పాకిస్థాన్ సరిహద్దులలో ఒక సైనిక పోస్టుపై బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్ జరిపిన కాల్పులలో ఒక బిఎస్‌ఎఫ్ జవాన్ గాయపడ్డాడు. జమ్మూకు 55 కిలోమీటర్ల దూరంలోని ఈ సరిహద్దు పోస్టుపై చిన్న ఆయుధాలతో పాక్‌వైపునుంచి జరిపిన కాల్పులలో బిఎస్‌ఎఫ్ జవాను కిషన్ గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఫ్లాగ్ మీటింగ్ సంద ర్భంగా పాక్ సైనిక అధికారలకు ఈ సంఘటనపై తీవ్ర నిరసన తెలుపు తాము అని అధికారులు చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ పాకిస్తాన్ 10 విడతలు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు.