'సూపర్‌ కౌబారు'గా లారెన్స్‌

18వ శతాబ్దానికి చెందిన ఓ కథను తీసుకుని కామెడీ ఎండ్వచంర్‌గా 'సూపర్‌ కౌబారు' రూపొందుతోంది. లారెన్స్‌ కథానాయకుడిగా రూపొందుతోంది. ఎ.జి.ఎస్‌. ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లిమిటెడ్‌ పతాకంపై కల్పాతి ఎస్‌.అగోరమ్‌ సమర్పిస్తున్నారు. శింబుదేవన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. 20 కోట్ల రూపాయల వ్యయంతో భారీగా నిర్మిస్తున్నట్లు చెబుతున్నారు. ఇంకా చిత్రం గురించి లారెన్స్‌ మాట్లాడుతూ...జి.వి.ప్రకాష్‌ మ్యూజిక్‌ బాగుంది. ఇంతవరకు తీయని లొకేషన్స్‌లో తీసిన 'సూపర్‌ కౌబారు' హీరోగా నాకు సూపర్‌ డూపర్‌ హిట్‌ నిస్తుంది'అని అన్నారు. దర్శకుడు శింబుదేవన్‌ మాట్లాడుతూ...'18వ శతాబ్దానికి చెందిన కథను తీసుకుని కామెడీ ఎడ్వంచర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. మాస్‌ ఆడియన్స్‌తోపాటు మహిళలు, చిన్న పిల్లలు కూడా ఇష్టపడేవిధంగా ఈ చిత్రం తీస్తున్నాం. రెడ్‌ ఇండియన్స్‌ గురించి ఇంతకుముందు ఎవరూ చూపించని విధంగా ఇందులో చూపిస్తున్నాం. అందుకోసం హాలీవుడ్‌ స్టైల్‌లో కేరళలో 300 మంది వర్కర్స్‌తో రాత్రింబవళ్ళు వర్క్‌ చేయించి అద్భుతమైన సెట్‌ వేశాం. ఇండియన్‌ ఫిలిం హిస్టరీలోనే ఇదో భారీ సెట్‌గా చెప్పుకోవచ్చు. శిధిలావస్థలో ఉన్న విజయనగర సామ్రాజ్యపు కందికోటలోని కంది కెనాల్‌లో ఫస్ట్‌టైమ్‌ షూట్‌ చేసిన చిత్రమిది. కంది కెనాల్‌లో రోజూ 20 కిలోమీటర్లు బోట్‌ ద్వారా ప్రయాణించి వెళ్ళి షూటింగ్‌ చేశాం. 30 అడుగుల లోతులో ఉన్న ఈ నదిలో చాలా రిస్కీ షాట్స్‌చిత్రీకరించాం. అలాగే ఈ చిత్రంలో నటించిన నటీనటులందరికీ హార్స్‌ రైడింగ్‌లో శిక్షణ ఇవ్వడం జరిగింది. కౌబారు చిత్రాల్లోనే ఎ సెన్సేషనల్‌మూవీగా 'సూపర్‌ కౌబారు' నిలుస్తుంది' అన్నారు.

సచిన్‌కు లోక్‌సభ అభినందనలు

వన్డే క్రికెట్‌ మ్యాచ్‌లో రెండు సెంచరీలతో చరిత్ర సృష్టించిన లిటిల్‌ మాస్టర్‌ సచిన్‌ టెండుల్కర్‌కు లోక్‌సభ గురువారం అభినందనలు తెలిపింది. సచిన్‌ సాధించిన రికార్డు దేశానికెంతో గర్వకారణమని లోక్‌ సభ స్పీకర్‌ మీరాకుమార్‌ అన్నారు. వన్డే క్రికెట్‌లో ఉన్నత శిఖ రాన్ని అధిరోహించిన సచిన్‌కు తనతోపాటు సభ్యులందరూ అభినందనలు తెల్పుతున్నారని స్పీకర్‌ పేర్కొన్నారు.

తోటి ఆటగాళ్లకు మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ స్ఫూర్తిగా నిలిచారని స్పీకర్‌ ప్రశంసించారు. భవిష్యత్తులోనూ అతడు మరిన్ని రికార్డులు సాధించాలని ఆమె ఆకాంక్షించారు.

మరో సారి కాల్పుల విరమణ ఉల్లంఘన

కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి సాంబా సెక్టార్లోని భారత్‌-పాకిస్థాన్‌ సరిహద్దులలో ఒక సైనిక పోస్టుపై బుధవారం తెల్లవారుజామున పాకిస్థాన్‌ జరిపిన కాల్పులలో ఒక బిఎస్‌ఎఫ్‌ జవాన్‌ గాయపడ్డాడు. జమ్మూకు 55 కిలోమీటర్ల దూరంలోని ఈ సరిహద్దు పోస్టుపై చిన్న ఆయుధాలతో పాక్‌వైపునుంచి జరిపిన కాల్పులలో బిఎస్‌ఎఫ్‌ జవాను కిషన్‌ గాయపడినట్టు అధికారులు తెలిపారు. ఫ్లాగ్‌ మీటింగ్‌ సంద ర్భంగా పాక్‌ సైనిక అధికారలకు ఈ సంఘటనపై తీవ్ర నిరసన తెలుపు తాము అని అధికారులు చెప్పారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకూ పాకిస్తాన్‌ 10 విడతలు కాల్పుల విరమణను ఉల్లంఘించిందని అధికారులు తెలిపారు.

మమతకు సిఎం రోశయ్య కృతజ్ఞతలు

కేంద్ర మంత్రి మమతా బెనర్జీ ప్రవేశపెట్టిన రైల్వే బడ్జెట్‌ పట్ల ముఖ్యమంత్రి రోశయ్య హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి తగినన్ని ప్రాజెక్టులు కేటాయించినందుకు మమతకు కృతజ్ఞతలు తెలుపుతూ ఆయన లేఖ రాశారు. గతంలో తాను జరిపినఢిల్లి పర్యటనలో ప్రధాని మన్మోహన్‌సింగ్‌, ఆర్థికమంత్రి ప్రణబ్‌ ముఖర్జీలతో రైల్యే బడ్జెట్‌పై చేసిన సంప్రదింపులు ఫలించాయని సిఎం అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం ముందుకొస్తే రాష్ట్ర వాటా విడుదల చేసేందుకు సిద్థమేనని రోశయ్య ఆ లేఖలో స్పష్టం చేశారు.

కుప్పకూలిన దక్షిణాఫ్రికా టాప్‌ అర్డర్‌


  • విజయలక్ష్యం 402



నేడు భారత్‌-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న రెండో వన్డే మొదట టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న భారత్‌ నిర్ణీత 50 ఓవర్లలో 401 పరుగులు చేసింది. ఈ విజయలక్ష్యాన్ని చేధించేందుకు బరిలో దిగిన దక్షిణాఫ్రికా మొదటి 15 ఓవర్లలోనే ఆరు వికెట్లు కోల్పోయి పికెలొతు కష్టాల్లోకి పడింది దక్షిణాఫ్రికా. దీనిలో శ్రీశాంత్‌-2,ప్రవీణ్‌కుమార్‌-1,అశీష్‌ నెహ్రా-1,రవీంద్ర జడేజా-1,యుసుఫ్‌ పఠాన్‌-1 వికెట్లు తీసారు.

ఇండియాకే వన్డే సీరీస్‌




వన్డే క్రికెట్‌ ఆరంభమైన 39 ఏళ్ల అనంతరం మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌ ప్రపంచ అత్యుత్తమ బౌలింగ్‌ను అద్వితీయంగా ఎదుర్కొని మొట్టమొదటి డబుల్‌ సెంచరీని నమోదుచేసి సరికొత్త రికార్డును నెలకొల్పాడు.

కెప్టెన్‌ రూప్‌సింగ్‌ స్టేడియంలో అమోఘంగా చెలరేగి పరుగుల వరదను పారించి..కెరీర్‌లోనే మరో అద్బుత ఇన్నింగ్స్‌ నమోదుచేయించడం ద్వారా రెండో వన్డేలో ఇండియాను గెలిపించాడు. 199 పరుగుల వరకు వచ్చిన సచిన్‌ డబుల్‌ సెంచరీ అందుకోవడానికి సుమారు రెండు ఓవర్లు వేచి చూడాల్సి వచ్చింది. చివరకు ఆఖరి ఓవర్‌లో 147 బంతిని ఎదుర్కొని ఆ మైలురాయిని పూర్తిచేశాడు. ఈ భారీ ఇన్నింగ్స్‌లో 25 అమోఘ బౌండరీలు 3 సిక్సర్లు ఉన్నాయి. పాకిస్థాన్‌కు చెందిన సయూద్‌ అన్వర్‌ 13 ఏళ్ళ క్రితం ఇండియాపైనే 194 పరుగులు చేసి అత్యధిక రికార్డుతో నిలబడగా, దాన్ని జింబాబ్వేకు చెందిన కోవెంట్రీ గత సంవత్సరం బంగ్లాదేశ్‌పై ఆడుతూ సమం చేయగలిగాడు.

కాగా సచిన్‌ మాస్టర్‌ క్లాస్‌ సూపర్బ్‌ బ్యాటింగ్‌తో తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఇండియా కేవలం 3 వికెట్ల నష్టానికి 401 పరుగులు చేయగా ఆ లక్ష్యాన్ని చేధించే క్రమంలో దక్షిణాఫ్రికాను 153 పరుగుల తేడాతో చిత్తుచేసింది. దీంతో మూడువన్డేల సీరీస్‌ను 2-0 తేడాతో హస్తగతం చేసుకుంది. వన్డేల్లో 400 పైగా స్కోరు నమోదుచేయడం ఇండియాకు ఇది మూడోసారి.

ఈ భారీ లక్ష్యాన్ని చేధించడానికి దిగిన దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌లో డివిలియర్స్‌ (114) ఒక్కడే సెంచరీతో అలరించగలిగాడు. దాంతోనే వారు 248 పరుగుల వరకు చేయగలిగారు. సీరీస్‌ నిలుపుకోవాలంటే తప్పకుండా మ్యాచ్‌ను గెలుచుకోవాల్సిన దక్షిణాఫ్రికా టాస్‌ కొల్పోవడంతోనే సగం మ్యాచ్‌ను పోగొట్టుకుంది. బ్యాటింగ్‌కు అనుకూలించే ఈ పిచ్‌పై ధోనీ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్‌ ఎంచుకుని దానికి తగ్గట్లే భారీ సవాల్‌ను ప్రత్యర్థి ముందు విసిరాడు. ఆపై భారత బౌలర్లు రాణించి దక్షిణాప్రికాను మరో 43 బంతులు మిగిలి ఉండగానే ఆలౌట్‌ చేయగలిగారు. 17 పరుగుల స్కోరుకే గిబ్స్‌ (7) వికెట్‌ను చేజార్చుకున్న తర్వాత ఆ జట్టు మరే దశలోనూ కోలుకోలేదు. శ్రీశాంత్‌ 3, నెహ్రా, జడేజా, యూసఫ్‌ పఠాన్‌ తలో రెండేసి వికెట్లు కూల్చి దెబ్బతీశారు. డివిలియర్స్‌ తర్వాత ఎక్కువ సేపు క్రీజులో నిలబడిన బ్యాట్స్‌మన్‌ ఓపెనర్‌ అవ్లూ(34)నే. మిగతా వారంతా 20 పరుగుల లోపుననే తిరిగి వచ్చారు. దాంతో డివిలియర్స్‌ ఒకవైపు ఒంటరిపోరాటం చేసినా ఫలితం లేకుండా పోయింది. 101 బంతుల్లో 114 పరుగులు (13ఫోర్లు 2 సిక్సర్లు) చేసిన డివిలియర్స్‌ అజేయంగా మిగిలాడు.

ఫ్లాట్‌ పిచ్‌పై కేవలం 9 పరుగులకే డాషింగ్‌ హిట్టర్‌ సెహ్వాగ్‌ థర్డ్‌మాన్‌లో క్యాచ్‌ ఇచ్చి తిరిగి రాగా, సచిన్‌ మొదట కార్తీక్‌, ఆతర్వాత ధోనీతో కలిసి రెండు సెంచరీల భాగస్వామ్యాన్ని నెలకొల్పగలిగాడు. సచిన్‌- దినేశ్‌ కార్తీక్‌ కాంబినేషన్‌ కలిసి దక్షిణాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడి పరుగుల వరదను పారించింది. దీంతో వీరిద్దరూ రెండో వికెట్‌కు 196 పరుగుల (117 బంతుల్లో) భాగస్వామ్యాన్ని అందించారు. కార్తీక్‌ 79 (85 బంతుల్లో 4 ఫోర్లు 3 సిక్సర్లు) పరుగులు చేసిన అనంతరం 34 ఓవర్‌లో పార్నెల్‌ బౌలింగ్‌లో గిబ్స్‌ అందుకున్న క్యాచ్‌తో తిరిగి వచ్చాడు. తర్వాత సచిన్‌తో కలిసిన యూసఫ్‌ పఠాన్‌ కేవలం 36 పరుగులకే వికెట్‌ పోగొట్టుకున్నాడు. సచిన్‌- పఠాన్‌ జోడి మూడో వికెట్‌కు 47 బంతుల్లో 81 పరుగులు జత చేయగలిగింది.

ఈ దశలో సచిన్‌ తో కలిసిన ధోనీ తనైదన స్టైల్‌లో 35 బంతుల్లోనే 68 (7 పోర్లు 4 సిక్సర్లు) పరుగులు చేయడంతోపాటు అజేయమైన నాలుగోవికెట్‌కు 101 పరుగులను జత కలుపడంతో ఇండియా భారీస్కోరును అందుకోగలిగింది. కేవలం 9 ఓవర్లలోనే ఈ జోడి సెంచరీ భాగస్వామ్యాన్ని అందుకోగలిగింది. సచిన్‌, ధోనీ నిలువరించడం దక్షిణాఫ్రికా బౌలర్లకు ఏ దశలోనూ సాధ్యం కాలేదు. సచిన్‌ ఆద్యంతం చక్కటి ఇన్నింగ్స్‌ ప్రదర్శించి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా 200 పరుగులతో అజేయంగా మిగిలాడు.

సచిన్‌ 37 బంతుల్లోనే తన హాఫ్‌ సెంచరీని పూర్తిచేయగా సెంచరీని 90 బంతుల్లోనే (13 ఫోర్లు) పూర్తిచేశాడు. సచిన్‌కు వన్డేల్లో ఇది 46వ సెంచరీ. తర్వాత 150 పరుగులను 118వ బంతితో పూర్తిచేసుకో (22 ఫోర్లు 1 సిక్సర్‌)గలిగాడు.

ఇండియా ఇన్నింగ్స్‌ ః సెహ్వాగ్‌ సి స్టేన్‌ బి పార్నెల్‌ 9, సచిన్‌ టెండూల్కర్‌ నాటౌట్‌ 200, దినేశ్‌ కార్తీక్‌ సి గిబ్స్‌ బి పార్నెల్‌ 79, యూసఫ్‌ పఠాన్‌ సి డివిలియర్స్‌ బి వాండెర్‌ మెర్వ్‌ 36, మహేంద్రసింగ్‌ ధోనీ నాటౌట్‌ 68

ఎక్స్‌ట్రాలు 9

మొత్తం ( 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి) 401

వికెట్ల పతనం ః 1-25(సెహ్వాగ్‌) 2-219(కార్తీక్‌) 3-300(పఠాన్‌)

బౌలింగ్‌ ః డేల్‌స్టేన్‌ 10-0-89-0, పార్నెల్‌ 10-0-95-2, వాండెర్‌మెర్వ్‌ 10-0-62-1, లాంగ్‌వెల్ట్‌ 10-0-70-0, డుమినీ 5-0-38-0, కలిస్‌ 5-0-44-0

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ ః అవ్లూ సి నెహ్రా బి శ్రీశాంత్‌ 34, గిబ్స్‌ బి కుమార్‌ 7,వాండెర్‌మెర్వ్‌ సి రైనా బి శ్రీశాంత్‌ 12, కలిస్‌ బి నెహ్రా 11, డివిలియర్స్‌ నాటౌట్‌ 114, పీటర్సెన్‌ బి జడేజా 9,డుమినీ ఎల్‌బి బి పఠాన్‌ 0, బౌచర్‌ ఎల్‌బి బి పఠాన్‌ 14, పార్నెల్‌ బి నెహ్రా 18, స్టేన్‌ బి శ్రీశాంత్‌ 0, లాంగ్‌వెల్ట్‌ సి నెహ్రా బి జడేజా 12

ఎక్స్‌ట్రాలు 17

మొత్తం (42.5 ఓవర్లలో ఆలౌట్‌) 248

వికెట్ల పతనం ః 1-17 (గిబ్స్‌) 2-47(వాండెర్‌మెర్వ్‌) 3-61(అవ్లూ) 4-83(కలిస్‌) 5-102(పీటర్సెన్‌) 6-103 (డుమినీ) 7-134(బౌచర్‌) 8-211 (పార్నెల్‌) 9-216(స్టేన్‌) 10-248 (లాంగ్‌వెల్ట్‌)

బౌలింగ్‌ ః ప్రవీణ్‌ కుమార్‌ 5-0-31-1,నెహ్రా 8-0-60-2,శ్రీశాంత్‌ 7-0-49-3, జడేజా 8.5-0-41-2, యూసఫ్‌ పఠాన్‌ 9-1-37-2, సెహ్వాగ్‌ 5-0-25-0

మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ ః

సచిన్‌ టెండూల్కర్‌

పాక్‌లో హిందువుల అపహరణ పట్ల ఖండన

పాక్‌లో నివసిస్తున్న ఒక హిందూ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు పెషావర్‌ నగరంలో అపహరించడంపట్ల కేంద్ర ప్రభుత్వం బుధవారం తీవ్రంగా ఖండించింది. ఈ అపహరణకు బాధ్యులయినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పాకిస్థాన్‌ ప్రభుత్వం హామీ ఇచ్చింది అని విదెశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ పార్లమెంటుకు తెలియ జశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని పాక్‌ ప్రభుత్వం హామీ ఇచ్చిందనీ, ఆ దేశంలోని గిరిజన ప్రాంతంలో ఇద్దరు సిక్కుల తల నరకడాన్ని, ఈ సంఘటనను పాక్‌ అధ్యక్షుడు తీవ్రంగా ఖండించారనీ బుధవారం లోక్‌ సభలో రైల్వే బడ్జెట్‌ ప్రవేశపెట్టేముందు ఎస్‌ఎం.కృష్ణ చేసిన ప్రకటనలో తెలిపారు. పెషావర్‌ నగరంలోని మార్కెట్‌ ప్రాంతంనుంచి రాబిన్‌ సింగ్‌ అనే కంప్యూటర్‌ ఇంజనీర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు అపహరించుకుపోవడం జరిగింది. అతనిని విడిచిపెట్టేందుకు కోటిరూపాయలు ఇవ్వాలని అపహరించినవారు డిమాండు చేశారు.

Sachin Tendulkar: A tiger who is never in the woods



Sachin Tendulkar is almost as old as one-day cricket. And the 36-year-old Little Master showed himself equal to the demands of this form of the game once again, when he delivered its first ever double- century knock on Wednesday against South Africa.Cricket aficionados will wax eloquent about his 200 runs for years, and it's worth remarking that Tendulkar's achievements have not waned even this late in his career. The record raises two interesting points. The first concerns the rapidity with which batting records have been broken in recent years. After Gary Sobers scored his 365 in 1958, then the highest in Test cricket, it took Brian Lara more than 30 years to break it. It took Matthew Hayden less than a decade to top that. And teams are successfully chasing down bigger (and bigger) scores in every version of the game. Tendulkar's record, then, may not stand for long. The second point is about bowling records, which seem more enduring in a batsman- dominated era. Anil Kumble's record of 10-for may well last a lot longer.

Nothing is impossible: Sachin Tendulkar’s unbeaten 200




Sachin Tendulkar’s winning 200 is a testimony to his fitness and liability even as he heads in place of his 37th birthday. He is looking as fit as
Alert and as fearsome as he continually has, and his timing remains safe and sound by the departing years.

Having played plow the age of 39, I know with the aim of control, high-quality, healthy living and focus can add years to one’s career. What I lost in pace and stamina, I gained in control and guile. Clothed in Tendulkar’s legal action, too, he has smartly sorted barred his game. He might not maintain the eye he had in his last-minute 20s, or the haste — folks are the greatest years of each batsman. However, Tendulkar has compensated in place of folks areas with outstanding shot selection and placement.

I every time retain with the aim of Test cricket and one-day cricket are two diverse areas, single cannot be connected to the other. However, Tendulkar’s rich vein of form in the longer version seems to maintain relaxed him and certain him the free expression to theatrical production in an unburdened method. Though I did not find out the rap, the statistics I maintain got are staggering.

The verity with the aim of he got the slash in 147 balls itself is a colossal achievement and by realization 200 he bettered single of the superlative one-day knocks I maintain seen, by Saeed Anwar. The latter was single of the sweetest timers of the orb, and with the aim of rap in Chennai was whilst he was by the side of the greatest of his form. To maintain bettered with the aim of Tendulkar ought to maintain really bowed on the the unexplained with selected animated shots.

There may well be many who will say with the aim of the wicket helped strokeplay and with the aim of near was nothing in it in place of the bowlers. But rebuff carry some weight pardon? The wicket is like, to attitude through 50 overs and slash 200 is a very, very special effort — an achievement with the aim of his contemporaries, Ricky Ponting and Brian Lara, would maintain been proud of.

If I had had to pick up a guy as the single to slash the basic one-day multiply by two ton, it would maintain been Virender Sehwag. He is adolescent, belligerent and in unbelievable contact. However, it was his illustrious senior who pipped him by the side of the stake. Tendulkar seems to maintain rediscovered an exuberance and enjoyment which seems to maintain taken his game to a diverse level, and India would be eager with the aim of he maintains this rhythm in place of selected schedule.

This achievement would mean a fate to Tendulkar, even though he has many records to his refer to for the reason that each opening ought to maintain had an eye on this pick up. A multiply by two century has solitary been a abstract risk in some degree of overs so far, so in many ways Tendulkar has achieved something curious. True, he has many feathers on his cap, but this single is a really special single. An categorically unique pick up by a really unique player.

ఏవీయస్ 'కోతిమూక' ఏం చేస్తుంది?

రావణాసురుడి దుమ్ముదులపడానికి కోతిమూక సహాయంతో రాముడు చేసే నిఖార్సయిన యుద్ధమే ఈ 'కోతిమూక' ఇతివృత్తం అంటున్నారు ఏవీయస్. ఆయన చిరకాల విరామం తర్వాత మళ్ళీ మెగా ఫోన్ పట్టుకుని 'కోతిమూక' చిత్రాన్ని డైరక్ట్ చేస్తున్నారు. కృష్ణుడు, శ్రద్ధా ఆర్య జంటగా రూపొందుతున్న చిత్రం షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఈ చిత్రం గురించి ఆయన మాట్లాడుతూ..రెండున్నర గంటలపాటు పూర్తి వినోదాన్ని అందించే చిత్రంగా దీన్ని తీస్తున్నాం. 24 నుంచి 55 రోజుల పాటు జరిపే సింగిల్ షెడ్యూలుతో సినిమాని పూర్తిచేస్తాం'' అని చెప్పారు. అలాగే సక్సెస్సే ధ్యేయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాను..ఇదివరకు నేను రూపొందించిన మూడు సినిమాలు దరశకుడిగా సంతృప్తినిచ్చినా, కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు అన్నారు. 'బందిపోటు' చిత్రంలో ఆరుద్ర రాసిన 'ఊహలు గుసగుసలాడే..' పాటని ఇందులో రీమిక్స్ చేస్తున్నామని తెలిపారు.

ఏ మాయ చేసావె'లో నాగచైతన్య పాత్ర




నాగచైతన్య, గౌతం మీనన్ కాంబినేషన్ లో రెడీ అయిన 'ఏ మాయ చేసావె' ఈ శుక్రవారం రిలీజవుతోంది. ఆ చిత్రంలో నాగచైతన్య పాత్ర పేరు కార్తీక్. ఇంజనీరింగ్ చదవి సినిమాల పట్ల అభిరుచితో అసిస్టెంట్ డైరెక్టర్ గా ఆ ఫీల్డ్ లోకి అడుగుపెడతాడు.పూరీ జగన్నాధ్ దగ్గర అసెస్టెంట్ గా పని చేస్తూంటాడు. అలాగే సాప్ట్ వేర్ కంపెనీలో పనిచేసే పక్కింటి అమ్మాయితో పరిచయం ఏర్పడుతుంది. ఆమె పేరు జెస్సీ. మళయాళీ క్రిస్టియన్. ఆ పాత్రను కొత్త హీరోయిన్ సమంత చేసింది. ఇక వీరిద్దరి మధ్య స్క్రీన్ కెమెస్ట్రీ కూడా బాగా పండిందని చెప్తున్నారు. ఇందులో ముడు పాటలు న్యూయార్క్ లో, ఒక పాట హైదరాబాద్ లోని సెట్ లో, మిగిలిన పాటలు చెన్నైలోని వివిధ లొకేషన్లలో తీశారు. అలాగే గౌతం మీనన్..ఘర్షణ తర్వాత తెలుగులో స్ట్రైయిట్ గా రూపొందించిన చిత్రం ఇది. జోష్ తర్వాత నాగచైతన్య హీరోగా చేసిన చిత్రం ఇది.

కెసిఆర్ రాజీనామా ఎందుకు చేయలేదు: శంకరరావు




తెలంగాణ జెఎసి పిలువు మేరకు తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు ఎందుకు లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేయలేదని కాంగ్రెసు తెలంగాణ శాసనసభ్యుడు పి. శంకరరావు ప్రశ్నించారు. శానససభ్యులందరితో రాజీనామా చేయించిన కెసిఆర్ తాను ఎందుకు రాజీనామా చేయలేదని ఆయన అడిగారు. ఇదే విషయాన్ని మహబూబ్ నగర్ లోకసభ నియోజకవర్గం ప్రజలు అడుగుతున్నారని ఆయన అన్నారు. రాజీనామాల వల్ల సమస్య పరిష్కారం కాదని, ప్రజా ప్రతినిధులుగానే పోరాడి తెలంగాణ సాధించుకోవాలని ఆయన అన్నారు.

ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థులు లాఠీ చార్జీ చేయడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ పై సీమాంధ్ర నాయకుల విమర్శలు సరి కాదని, కోదండరామ్ పై కేసులు పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. సీమాంధ్ర ఉత్పత్తుల బహిష్కరించాలనే తెలంగాణ జెఎసి పిలుపును కూడా ఆయన వ్యతిరేకించారు.

మీడియాపై కేసులు ఎత్తేస్తాం: రోశయ్య




ఉస్మానియా యూనివర్సిటీలో మీడియాపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కె.రోశయ్య హామీ ఇచ్చారు. పోలీసుల లాఠీఛార్జిలో దెబ్బ తిన్న కెమేరాలు, సెల్‌ఫోన్‌లు, వాహనాలకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని తెలిపారు. సీఎం హామీతో మీడియా శనివారం తలపెట్టిన బడ్జెట్‌ సమావేశాల ప్రసార బహిష్కరణను విరమించుకుంది. శనివారం ఉదయం శాసనసభ సమావేశాలు ప్రారంభమైనా వాటిని టీవీ ఛానళ్లు ప్రసారం చేయలేదు. ఈ సమాచారం సీఎం దృష్టికి వెళ్లడంతో ఐజేయు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డిసహా మీడియా ప్రతినిధులను తన ఛాంబర్‌కు పిలిపించి మాట్లాడారు. ఈ సమయంలో హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి, సమాచార శాఖ మంత్రి జె.గీతారెడ్డి కూడా ఉన్నారు.

దాడి సంఘటనలో బాధ్యులపై చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. అనంతరం సీఎం సూచన మేరకు మంత్రులు గీతారెడ్డి, సబితాఇంద్రారెడ్డిలు 'మీడియా పాయింట్‌' వద్ద విలేఖరులతో మాట్లాడారు. ఉస్మానియా సంఘటన నేపథ్యంలో విలేకరులపై పెట్టిన కేసులను ఎత్తివేస్తామని చెప్పారు. బాధ్యులైన పోలీసులపై కేసులు పెట్టాలన్న డిమాండ్‌పై హోంమంత్రి స్పందిస్తూ సీఐడీ దర్యాప్తు నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీఎం హామీతో బడ్జెట్‌ ప్రసంగాన్ని బహిష్కరించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించినట్టు ఐజేయు ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు.

కాంగ్రెస్‌ ఎంపీలు గుత్తా,మందాల ఘెరావ్‌

తెలంగాణ కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యులు డాక్టర్‌ మందా జగన్నాధ్‌, గుత్తా సుఖేందర్‌రెడ్డిలను తెలంగాణ న్యాయవాదులు మంగళళవారంనాడిక్కడ ఘెరావ్‌ చేసి పదవులకు రాజీనామాలు చేయాలని పట్టుబట్టారు. లోక్‌సభ సమావేశం వాయిదా పడిన తర్వాత పార్లమెంట్‌కు సమీపంలోని విజయ్‌చౌక్‌ వద్ద తెలుగు టీవీ ఛానళ్లతో మాట్లాడేందుకు వెళ్లిన మందా, గుత్తాలను అక్కడ గుమికూడిన తెలంగాణ న్యాయవాదులు చుట్టుముట్టి పార్లమెంట్‌ సభ్యత్వాలకు ఎందుకు రాజీనామా చేయడం లేదని నిలదీశారు. మంగళళవారంనాడు పార్లమెంట్‌ వద్ద ధర్నా కోసం ప్రత్యేక రైలులో ఢిల్లీ వచ్చిన తెలంగాణ న్యాయవాదులు రాజీనామాలు చేయాలని కోరేందుకు బుధవారంనాడు పార్లమెంట్‌ సమీపంలోని విజయ్‌చౌక్‌ వద్ద కాపుకాశారు. తెలంగాణలో విద్యార్థులు ఆత్మాహుతి చేసుకొంటుండగా మీరిక్కడ పదవుల్లో కొనసాగుతుండడమేమిటని ప్రశ్నించిన న్యాయవాదులు కాంగ్రెస్‌ ఎంపీలతో వాగ్వివాదానికి దిగారు. తామంతా కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనకే చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని, రాజీనామాలతో తెలంగాణ ఆవిర్భావం మరింత ఆలస్యమౌతుందే తప్ప ప్రయోజనం ఉండదని వారికి నచ్చజెప్పేందుకు ఎంపీలు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది.